వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై GHMC అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి రావుకు చెందిన నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ ఉప్పల్‌లోని హైకోర్టు కాలనీ, సూర్యాపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి తనిఖీలు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సోదాల్లో స్థిర, చరాస్తుల వివరాలు, ఆర్థిక లావాదేవీలు, ఆదాయ వనరులపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...

