వార్తలకు తిరిగి వెళ్లండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 40 కేజీల గంజాయి స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రంగపురం వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 40 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు.
ఒడిశా మల్కన్‌గిరి నుంచి మహారాష్ట్ర, స్థానిక ప్రాంతాలకు వాహనాల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి వాహనాలతో పాటు గంజాయిని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...