Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షంలోనూ వినాయక నిమజ్జనాలు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:01 AM జయ శంకర్ భూపాలపల్లి General
వర్షంలోనూ వినాయక నిమజ్జనాలు - Udayam
కాళేశ్వరం గోదావరి అంతరాష్ట్ర వంతెన వద్ద గురువారం వర్షాన్ని లెక్కచేయకుండా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇప్పటివరకు దాదాపు 400 విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని అడిషనల్‌ ఎస్పీ నరేష్‌కుమార్‌ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఇతర శాఖల అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...