Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధారి: డిగ్రీ కళాశాల కోసం ఏళ్ల నిరీక్షణ

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 8:23 AM కామరెడ్డిGeneral
గాంధారి: డిగ్రీ కళాశాల కోసం ఏళ్ల నిరీక్షణ - Udayam
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలం నుంచి ప్రజలు, యువత కోరుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఆశించినంత మేర లేవని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. గాంధారి చుట్టుపక్కల మారుమూల గ్రామాల విద్యార్థులు డిగ్రీ చదువుకోవాలంటే బాన్సువాడ లేదా కామారెడ్డికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.

Comments

G
Loading comments...