వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం జోరు వానలోనూ గణపతి నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు. సంప్రదాయ మేళతాళాలు, నృత్య ప్రదర్శనలతో వేడుకలు రాత్రి వరకు కొనసాగాయి.
మహిళలు కొబ్బరికాయలు కొట్టి, అడుగడుగునా హారతులు ఇస్తూ వినాయకుడికి వీడ్కోలు పలికారు. డీజే శబ్దాలు లేకుండా సంప్రదాయ పద్ధతిలో నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి.
Comments
Loading comments...

