వార్తలకు తిరిగి వెళ్లండి

గాజులరామారం మెట్టుకాన్‌గూడలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు పోచమ్మ తల్లి గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రీ దేవి సకల వేదాలకు మూలం, జ్ఞానానికి ప్రతిరూపమని పూజారి పార్థసారథి తెలిపారు.
ఆమెను ఆరాధిస్తే బుద్ధి వికసించి, విద్యలో విజయం లభిస్తుందని భక్తుల విశ్వాసమని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Comments
Loading comments...

