Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయపడిన గురుకుల విద్యార్థికి రూ.50 వేల సాయం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:59 PM యాదాద్రి భువనగిరిGeneral
గాయపడిన గురుకుల విద్యార్థికి రూ.50 వేల సాయం - Udayam
నాగార్జునసాగర్‌ గురుకుల పాఠశాల మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడి గాయపడిన మిర్యాలగూడకు చెందిన విద్యార్థి ఆవుల నరేందర్‌ను ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. ఎల్‌బీనగర్‌లో చికిత్స పొందుతున్న నరేందర్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఖర్చుల కోసం నరేందర్‌ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. విద్యార్థికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...