Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టేక్మాల్‌లో పూర్తిగా నిండిన కుడి చెరువు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 11:47 AM మెదక్General
టేక్మాల్‌లో పూర్తిగా నిండిన కుడి చెరువు - Udayam
టేక్మాల్ మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కుడి చెరువు పూర్తిగా నిండింది. భారీగా నీరు చేరడంతో మత్తడి దూకుతూ జలకళను సంతరించుకుంది. మత్తడి ద్వారా నీరు బయటకు ప్రవహిస్తుండటంతో పరిసర రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు నిండటంతో ఆయకట్టు పంటలకు సాగునీటి భరోసా ఏర్పడిందని రైతులు తెలిపారు. భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...