Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు పూర్తి మద్దతు: డిప్యూటీ సీఎం భట్టి

Follow Udayam on Google
Rohit Singh Jun 09, 2026 1:58 PM హైదరాబాద్General
రైతులకు పూర్తి మద్దతు: డిప్యూటీ సీఎం భట్టి - Udayam
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే 72 లక్షల టన్నుల ధాన్యం సేకరించి, రూ.14వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, తడిచిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకే కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు. రైతులకు రూ.22వేల కోట్ల రుణమాఫీ చేశామని, 53 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన దేవాదుల ప్రాజెక్టును నిధులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...