వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 3,259 మంది ఇంటర్ విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఉచిత నోటు పుస్తకాలు అందించనున్నారు. ఒక్కో విద్యార్థికి 12 నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.
దీంతో పేద కుటుంబాల విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గనుంది. ప్రభుత్వ కళాశాలల్లో అందుతున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

