వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో త్వరలోనే రాత్రిపూట కూడా ఉచిత అన్నదానం ప్రారంభించనున్నట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ప్రకటనలో పేర్కొన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

