Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ అధ్యక్షుడు యూన్‌కు మరో 30 ఏళ్ల జైలు శిక్ష

Follow Udayam on Google
Rohit Singh Jun 12, 2026 2:49 PM జాతీయంGeneral
మాజీ అధ్యక్షుడు యూన్‌కు మరో 30 ఏళ్ల జైలు శిక్ష - Udayam
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యేల్‌కు కోర్టు మరో 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2024లో ఉత్తర కొరియాలోకి డ్రోన్లను పంపడం ద్వారా ఉద్రిక్తతలను రెచ్చగొట్టారనే ఆరోపణలతో ఆయనను దోషిగా తేల్చింది. ఇప్పటికే ఆయన మార్షల్‌ లా కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నిందితులు సైనిక చర్యను ముసుగుగా వాడుకున్నారని న్యాయస్థానం స్పష్టం చేసింది. యూన్‌తో పాటు పలువురు మాజీ రక్షణ అధికారులకు కూడా ఈ కేసులో జైలు శిక్షలు ఖరారయ్యాయి.

Comments

G
Loading comments...