వార్తలకు తిరిగి వెళ్లండి
ఇసుక తరలింపుపై మాజీ ఎమ్మెల్యే నిరసన
Harika Jun 22, 2026 1:49 PM నారాయణపేట 4 viewsabout 1 hour ago

మాగనూరు పెద్దవాగు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆందోళన చేపట్టారు. మంత్రి బంధువుల సంస్థ అక్రమంగా టిప్పర్లను నడుపుతోందని ఆరోపిస్తూ వాహనాలను ఆయన అడ్డుకున్నారు.
అధికారులు, పోలీసుల అండతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...