Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయపట్నం పోర్టుపై మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 19, 2026 7:18 PM అమరావతిGeneral
రామాయపట్నం పోర్టుపై మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు - Udayam
రామాయపట్నం పోర్టు అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం కుంభకోణంగా మారుస్తోందని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో పోర్టు పనులు వేగవంతం చేశామని, బీపీసీఎల్, ఇండోసోల్ సోలార్ వంటి భారీ ప్రాజెక్టులు దీనివల్లే వచ్చాయని ఆయన గుర్తుచేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రూ.4,929 కోట్లు ఖర్చు చేసిన ఈ పోర్టును, కేవలం రూ.1,500 కోట్లు చెల్లించిన ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోందని, ప్రభుత్వమే అప్పుల భారం మోయాల్సి వస్తోందని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...