Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులకు విదేశీ విద్య అధ్యయన అవకాశం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 04, 2026 11:38 AM ఖమ్మంGeneral
ఉపాధ్యాయులకు విదేశీ విద్య అధ్యయన అవకాశం - Udayam
ప్రతిభగల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు విదేశీ విద్యా విధానాల అధ్యయనానికి పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. అర్హుల ఎంపిక కోసం ఈ నెల 5న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. విద్యార్థుల నమోదు పెంపు, అభ్యసన ఫలితాలు, వినూత్న బోధన వంటి అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జిల్లా స్థాయి ఎంపిక జాబితాను రాష్ట్ర స్థాయికి పంపుతామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...