Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరంగపట్నంలో వరద ఉధృతి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 4:40 PM తూర్పుగోదావరి General
శ్రీరంగపట్నంలో వరద ఉధృతి - Udayam
కోరుకొండ మండలం శ్రీరంగపట్నం వద్ద బురదకాలువ పొంగిపొర్లడంతో రహదారులపైకి వరద నీరు చేరింది. మన్యం ప్రాంతాల్లో భారీ వర్షాలు, సూరంపాలెం, ముసిరిమిల్లి రిజర్వాయర్ల నుంచి అదనపు నీటి విడుదలతో కాలువలో నీటిమట్టం పెరిగింది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరిస్థితిని పరిశీలించి, ముంపు ప్రమాదం ఉన్న ఇళ్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వారికి భోజనం, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...