Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమ్మిలేరుకు తొలిసారి వరద ఉద్ధృతి

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 12:30 PM ఏలూరుGeneral
తమ్మిలేరుకు తొలిసారి వరద ఉద్ధృతి - Udayam
ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తమ్మిలేరుకు ఈ ఏడాదిలో తొలిసారిగా వరద ప్రవాహం మొదలైంది. గురువారం ఉదయం చాట్రాయి మండలం చిన్నంపేట తమ్మిలేరు కాజ్‌వే వద్ద వరద ఉద్ధృతి పెరిగింది. తెలంగాణలోని వేంసూరు, సత్తుపల్లి మండలాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా తమ్మిలేరులో ప్రవాహం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. వర్షాకాలం ప్రారంభం నుంచి తమ్మిలేరులో చుక్కనీరు లేకపోవడం గమనార్హం.

Comments

G
Loading comments...