Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 31, 2026 11:12 AM జయ శంకర్ భూపాలపల్లి General
కాళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి - Udayam
తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం త్రివేణి సంగమంలో నీటిమట్టం 9.930 మీటర్లకు చేరగా, సాధారణ, సరస్వతీ పుష్కర ఘాట్‌ మెట్లపై నుంచి వరద ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి 8.39 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో అధికారులు 85 గేట్లు ఎత్తి వచ్చిన వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...