వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటలకు 1,82,337 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో గోదావరి, ప్రాణహిత నదుల వరద ఉధృతి క్రమంగా తగ్గుతోందని ఈఈ సురేష్ వెల్లడించారు. సోమవారం నుంచి మంగళవారం వరకు సుమారు 73 వేల క్యూసెక్కుల ప్రవాహం తగ్గినట్లు తెలిపారు.
Comments
Loading comments...

