Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంక్‌ డ్రైవ్‌ కేసుల్లో ఐదుగురికి జైలు శిక్ష

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 7:15 PM కాకినాడGeneral
డ్రంక్‌ డ్రైవ్‌ కేసుల్లో ఐదుగురికి జైలు శిక్ష - Udayam
కాకినాడలో ట్రాఫిక్ 1, 2 పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో 13 మంది పట్టుబడగా, ఐదుగురికి జైలు శిక్ష విధించారు. మంగళవారం వీరిని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ట్రాఫిక్-1 సీఐ నూని రమేష్ తెలిపారు. మిగిలిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిరంతరం నిర్వహిస్తామని సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...