Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోల్‌కతా హోటల్‌లో మంటలు.. 9 మంది మృతి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 9:04 AM ఆల్ ఇండియా జాతీయ
కోల్‌కతా హోటల్‌లో మంటలు.. 9 మంది మృతి - Udayam
కోల్‌కతాలోని మిర్జా గాలిబ్‌ స్ట్రీట్‌లో ఓ హోటల్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఓ చిన్నారి సహా పలువురు బంగ్లాదేశ్‌ పౌరులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించగా, ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...