Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:14 PM ఆదిలాబాద్General
అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం - Udayam
రిమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల నష్టపరిహారం చెక్కును బోథ్ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ సోమవారం అందజేశారు. ఇచ్చోడకు చెందిన చిన్నారి తండ్రి షేక్‌ సలీంకు రిమ్స్‌లో చెక్కు అందించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...