Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 6:22 PM హైదరాబాద్General
ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం - Udayam
హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్ కా నాలా సమీపంలో ఫర్నిచర్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. ఫర్నిచర్, ఇతర సామగ్రి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగతో పరిసరాల్లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...