వార్తలకు తిరిగి వెళ్లండి
కరెంట్ కోతలతో ఎండిపోతున్న వరి నార్లు.. రైతుల రాస్తారోకో
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూర్ గ్రామంలో కరెంట్ కోతలకు నిరసనగా రైతులు సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. తిప్పర్తి-నకిరేకల్ రోడ్డుపై వాహనాలను అడ్డుపెట్టి ఆందోళన చేపట్టారు.
విద్యుత్ కోతలతో వరి నార్లు ఎండిపోతున్నాయని, అధికారులు అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తూ మంత్రి కోమటిరెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...