వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా కోసం ప్రవేశపెట్టిన యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. యాప్ వల్ల ఎరువులు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని నిరసన వ్యక్తం చేశారు. డిచ్‌పల్లిలో చెప్పులను వరుసలో ఉంచి రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు.
నిరక్షరాస్యులైన రైతులు యాప్ వాడకంతో ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అధికారులు జోక్యం చేసుకుని యూరియా సరఫరాకు హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించారు.
Comments
Loading comments...

