వార్తలకు తిరిగి వెళ్లండి

శంకర సముద్రం బాలెన్సింగ్ రిజర్వాయర్ కుడి కాలువ ఎత్తిపోతలకు విద్యుత్తు సమస్య తీవ్రంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 24 గంటల విద్యుత్తుతో 3,500 ఎకరాలు సాగయ్యాయని తెలిపారు.
ప్రస్తుతం ఉదయం 6 నుంచి సాయంత్రం వరకు మాత్రమే విద్యుత్తు సరఫరా అవుతోందని రైతులు పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్తు సరఫరాను పునరుద్ధరిస్తే ఆరుతడి పంటలు సాగు చేసుకుంటామని కోరారు.
Comments
Loading comments...

