Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామసముద్రంలో రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 12:50 PM అన్నమయ్యGeneral
రామసముద్రంలో రోడ్డు ప్రమాదంలో రైతు మృతి - Udayam
రామసముద్రం మండలం కనగాని గ్రామానికి చెందిన రైతు చెన్నారెడ్డి (53) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం రాత్రి సదుం మండలంలోని అయ్యప్పస్వామి ఆలయంలో ఇరుముడి సమర్పించి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. పుంగనూరు–రామసముద్రం రహదారిలో వనగానపల్లి సమీపంలో బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

Comments

G
Loading comments...