వార్తలకు తిరిగి వెళ్లండి

శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి రైతు గూనంగారి స్వామి(40) మృతి చెందారు. సాగు పనులు ముగించుకుని నేరెళ్లకుంట వద్ద కాళ్లు కడుగుతుండగా జారి నీటిలో పడిపోయినట్లు తెలిసింది.
స్థానికులు వెంటనే బయటకు తీసి ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

