వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్ల గజ్జెల సోదరుల శిల్ప వైభవం

సిరిసిల్లకు చెందిన గజ్జెల సోదరులు పంచలోహ విగ్రహాల తయారీలో విశేష గుర్తింపు పొందుతున్నారు. వేములవాడ, యాదాద్రి, పూరీతో పాటు దేశ విదేశాల్లోని ఆలయాలకు ఉత్సవ విగ్రహాలు, ధ్వజస్తంభాలు రూపొందిస్తూ కుటుంబ వారసత్వ కళను కొనసాగిస్తున్నారు.
తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ఈ ముగ్గురు సోదరులు ఉన్నత విద్య చదివినా కులవృత్తినే ఎంచుకున్నారు. ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని అద్భుత శిల్పాలు రూపొందిస్తామని తెలిపారు.
Comments
Loading comments...