Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ నోట్ల మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 04, 2026 7:05 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
నకిలీ నోట్ల మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ - Udayam
బ్లాక్ పేపర్లను రసాయన ద్రావణంలో ముంచితే రూ.500 నోట్లుగా మారుతాయని నమ్మించి మోసాలకు పాల్పడిన వ్యక్తిని అశ్వారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.15 లక్షలు ఇస్తే కోటి రూపాయలు తయారు చేస్తానని చెప్పి బాధితుడి నుంచి రూ.13 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి బ్లాక్ పేపర్లు, రసాయన ద్రావణాల సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...