Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గెలలొచ్చే.. కర్మాగారాలు కళకళ

Follow Udayam on Google
రాజేష్ Aug 15, 2026 9:31 AM ఖమ్మంతెలంగాణ
గెలలొచ్చే.. కర్మాగారాలు కళకళ - Udayam
రెండు నెలలుగా గెలల రాక లేక బోసిపోయిన ఆయిల్‌పాం కర్మాగారాలు మళ్లీ కళకళలాడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అప్పారావుపేట కర్మాగారాలకు మూడు రోజులుగా రైతులు భారీగా గెలలు తరలిస్తున్నారు. అశ్వారావుపేటకు రోజూ 500 నుంచి 600 టన్నులు, అప్పారావుపేటకు 1,400 నుంచి 1,600 టన్నుల గెలలు వస్తున్నాయి. శుక్రవారం సాయంత్రానికి రెండు కర్మాగారాల వద్ద 163 ట్రాక్టర్లు బారులుతీరాయి.

Comments

G
Loading comments...