Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్ ట్యాంక్ పేలి ఐదుగురు కార్మికులకు గాయాలు

Follow Udayam on Google
S kumar Sep 03, 2026 12:36 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి: రామగుండం అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులోని ఎఫ్.బీ.ఎల్ ఎయిర్ ట్యాంక్ పేలి ఐదుగురు సింగరేణి కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులైన శ్రీనివాస్, కిరణ్, లక్ష్మణ్, ప్రశాంత్, మనోజ్‌లను గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. యాజమాన్య రక్షణ వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బిఎంఎస్ నాయకుడు యాదగిరి సత్తయ్య ఆరోపించారు.

Comments

G
Loading comments...