వార్తలకు తిరిగి వెళ్లండి
కుప్పంలో అవకాడో సాగు ప్రయోగం

చల్లటి వాతావరణంలో పండే అరుదైన అవకాడో (బటర్‌ఫ్రూట్) పంటను చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ రైతులు ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. శాంతిపురం మండలంలో సుమారు 10 ఎకరాల్లో ఈ తోటలను పెంచుతున్నారు.
మూడేళ్ల క్రితం నాటిన ఈ మొక్కలు ప్రస్తుతం దిగుబడి దశకు వచ్చాయి. ఏడాదికి రెండుసార్లు కాపుకొచ్చే ఈ పంట 25 ఏళ్ల పాటు దిగుబడి ఇస్తుందని, మార్కెట్‌లో మంచి ధర పలుకుతుండటంతో గిట్టుబాటు ఆదాయం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...