వార్తలకు తిరిగి వెళ్లండి
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీశ్, డ్రైవర్. రాకేష్ లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. వినాయక నిమజ్జన విధులు ముగించుకుని తిరుమలాయపాలెం వస్తుండగా పిండిప్రోలు శివారులోని భవానీ హోటల్ సమీపంలో కారును లారీ ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన ఎస్సై, డ్రైవర్ ను ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

