వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రగడ్డ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శివశంకర్రెడ్డిని చికిత్స కోసం ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
వనపర్తి జిల్లా అమరచింత మండలానికి చెందిన శివశంకర్రెడ్డి గతంలోనూ జైలు నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు, జైలు అధికారులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

