Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎఫ్‌ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు?

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 04, 2026 9:48 AM జాతీయంGeneral
ఈపీఎఫ్‌ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు? - Udayam
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) గరిష్ఠ వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై కార్మికశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించిన అనంతరం ఈపీఎఫ్‌వో నిబంధనల్లో మార్పులు చేసి అమల్లోకి తీసుకురానున్నారు. కనీస పింఛను పెంపు అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...