వార్తలకు తిరిగి వెళ్లండి

వంగర-పార్వతీపురం రోడ్డులో ఎం.సీతారాంపురం వద్ద మలుపు ప్రమాదకరంగా మారింది. రోడ్డు ఇరువైపులా పిచ్చి మొక్కలు వేపుగా ఉండడంతో పాటు మలుపు వద్ద గొయ్యి ఏర్పడి వర్షం పడితే నీరు నిల్వ ఉంటుంది.
దీంతో వచ్చిపోయే వాహనాలు కనిపించక వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మలుపు వద్ద వేగ నియంత్రక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

