Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీలాడ్స్ నిధుల వినియోగంలో టాప్‌లో దగ్గుమళ్ల

Follow Udayam on Google
dineshkumar Sep 01, 2026 2:55 PM చిత్తూరుGeneral
ఎంపీలాడ్స్ నిధుల వినియోగంలో టాప్‌లో దగ్గుమళ్ల - Udayam
కేంద్ర ప్రభుత్వం ఎంపీల నియోజకవర్గాల అభివృద్ధికి ఏటా రూ.5 కోట్ల ఎంపీలాడ్స్ నిధులు విడుదల చేస్తోంది. తాజాగా విడుదలైన వివరాల ప్రకారం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు రెండు తెలుగు రాష్ట్రాల్లో 52 శాతం నిధుల వినియోగంతో టాప్‌లో నిలిచారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్, కడప జిల్లా ఇన్‌చార్జి చిట్టిబాబు కొల్లా ఎంపీని దుశ్శాలువతో సన్మానించారు. ఆయనతోపాటు రామభద్ర, షణ్ముగం పాల్గొన్నారు.

Comments

G
Loading comments...