Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్కె రాజపురం జంక్షన్ సమీపంలో ప్రమాదకరంగా మారిన గుంతలు

Follow Udayam on Google
Ganga Sep 27, 2026 5:44 PM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండ మండల ఎన్కి రాజపురం జంక్షన్ సమీపంలో సీతంపేటకు వెళ్లే ప్రధాన రహదారిలో గుంతలు ప్రమాదకరంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దపెద్ద గుంతల్లో నీరు చేరడంతో వాటి లోతు తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంతలను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...