వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఆర్‌పీ కంటే అధిక ధరకు 28-28-0 ఎరువులు విక్రయించిన ఉట్నూరులోని శ్రీనివాస ఫర్టిలైజర్స్ లైసెన్స్‌ను వ్యవసాయశాఖ అధికారులు 15 రోజులపాటు సస్పెండ్ చేశారు. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలతో తనిఖీలు నిర్వహించి నిబంధనల ఉల్లంఘనను నిర్ధారించారు.
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఫిర్యాదులకు 8977742855కు సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

