Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన

Follow Udayam on Google
K.Venkatesh Sep 08, 2026 2:13 PM ఖమ్మంGeneral
ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టును ఖండిస్తూ తిరుమలాయపాలెం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరసన తెలిపాయి. పార్టీ మండల అధ్యక్షుడు వీరన్న ఆధ్వర్యంలో నాయకులు, కార్య కర్తలు ప్రధాన రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని వీరన్న మండిపడ్డారు. తాతా మధును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

Comments

G
Loading comments...