Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అణగారిన కులాలకు ఎమ్మార్పీఎస్‌ అండ

Follow Udayam on Google
Harika Aug 25, 2026 3:08 PM జోగులాంబ గద్వాల్ General
అణగారిన కులాలకు ఎమ్మార్పీఎస్‌ అండ - Udayam
అణగారిన కులాలకు ఎమ్మార్పీఎస్‌ అండగా ఉంటుందని ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకుడు ఆంజనేయులు అన్నారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మంగళవారం చిన్న తాండ్రపాడులో పర్యటించి నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామ అధ్యక్షుడిగా సూర్యసాగర్‌ను ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్‌ 30 ఏళ్లుగా బడుగుల పక్షాన పోరాడుతోందని ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో ఏసన్న, ప్రకాశ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...