Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లపల్లిలో బెల్ట్‌షాప్‌పై పోలీసుల దాడి.. రూ.93 వేల మద్యం స్వాధీనం

Follow Udayam on Google
Sandeep Sep 25, 2026 9:59 AM నిర్మల్General
ఎల్లపల్లిలో బెల్ట్‌షాప్‌పై పోలీసుల దాడి.. రూ.93 వేల మద్యం స్వాధీనం - Udayam
నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. గ్రామానికి చెందిన గుండ్ల నవీన్ అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం మేరకు గురువారం అర్ధరాత్రి పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్ట్ షాప్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 93 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...