వార్తలకు తిరిగి వెళ్లండి

తోగుట మండలం ఎల్లారెడ్డిపేటలో సోమవారం అర్ధరాత్రి కొండచిలువ కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎస్ఐ నవీన్ ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందితో మాట్లాడారు.
అనంతరం అటవీశాఖ అధికారులు కొండచిలువను సురక్షితంగా బంధించి గ్రామం నుంచి తరలించారు. దీంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Loading comments...

