వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. న్యూయార్క్‌లో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు గతంలో పలు చర్యలు చేపట్టినట్లు జైశంకర్ తెలిపారు. వాణిజ్యం, భద్రత, ఇంధనం, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచేందుకు ఇరు దేశాలు రోడ్‌మ్యాప్‌పై అంగీకరించాయి.
Comments
Loading comments...

