వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలం కళ్లికోట పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు ఎలిఫెంట్ మానిటరింగ్ అధికారులు గురువారం తెలిపారు. సమీప కొండ ప్రాంతంలో ఏనుగులు ఉండటంతో పరిసర గ్రామాల ప్రజలు అటువైపు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఎలిఫెంట్ ట్రాకర్స్ సూచనలు పాటిస్తూ ఏనుగులకు దూరంగా ఉండాలని సూచించారు. అడవి ఏనుగులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

