Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామకూరులో నిలిచిన విద్యుత్ సరఫరా

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 9:56 AM బాపట్లGeneral
రామకూరులో నిలిచిన విద్యుత్ సరఫరా - Udayam
బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం రామకూరు గ్రామంలో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రామకూరు-ధర్మవరం మధ్య విద్యుత్ ఇన్సులేటర్లు దెబ్బతినడంతో ఈ సమస్య తలెత్తినట్లు గ్రామస్థులు తెలిపారు. విద్యుత్ లేక చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవ తీసుకుని విద్యుత్ పునరుద్ధరించాలని కోరారు.

Comments

G
Loading comments...