Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో 14 మత్స్యకార సొసైటీలకు ఎన్నికలు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 2:33 PM అనకాపల్లి General
అనకాపల్లిలో 14 మత్స్యకార సొసైటీలకు ఎన్నికలు - Udayam
అనకాపల్లి జిల్లాలో 14 మత్స్యకార సొసైటీలకు అక్టోబర్ 6న ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారిణి విజయ గురువారం తెలిపారు. ఈ నెల 29న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందని వెల్లడించారు. చేతులెత్తే విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు మత్స్యకారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...