వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని బిజెపి మండల అధ్యక్షులు కోడె రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మానేరును పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పి చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

