Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏర్గట్ల గ్రామాభివృద్ధి కమిటీపై చర్యలు తీసుకోవాలి సీపీఎం

Follow Udayam on Google
Raju Sep 26, 2026 11:27 AM నిజామాబాద్తెలంగాణ
ఏర్గట్ల గ్రామాభివృద్ధి కమిటీపై చర్యలు తీసుకోవాలి సీపీఎం - Udayam
ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో గీత కార్మికులపై సాంఘిక బహిష్కరణ విధించిన గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలపై చట్టపర చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. గ్రామానికి చెందిన 32 గౌడ కుటుంబాలు, 12 దళిత కుటుంబాల ప్రతినిధులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఏ.రమేశ్ బాబును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.

Comments

G
Loading comments...